ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న కొందరు సెన్సేషనల్ హీరోయిన్స్ లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా ఒకామె. మరి వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా ఆమె మారగా ఇప్పుడు ఆమె నుంచి వచ్చిన రీసెంట్ సినిమాలు అన్నీ కూడా ప్లాప్ గానే నిలిచాయి.
దీనితో ఇక ఆమె కొత్త సంవత్సరం మీద మాత్రమే నమ్మకాన్ని పెట్టుకుంది. అయితే ఈ కొత్త ఏడాదిలో ఆమె నుంచి మొదటగా రాబోతున్న సినిమానే “గుంటూరు కారం”. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా ఇది కాగా ఇందులో ఈమె ఒక హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే శ్రీలీల హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఆమె ఎంబీబీఎస్ కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి సినిమాతో పాటుగా కెరీర్ ని కూడా సెట్ చేసుకుంటాను అని ఎప్పుడో చెప్పింది. కానీ ఇప్పుడు సినిమా కోసం అయితే కెరీర్ ని ఆమె పక్కన పెట్టినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఆమె ఇపుడు గుంటూరు కారంలో షూట్ చేయాల్సిన సీన్స్ ఇంకా బ్యాలన్స్ ఉండడంతో ఆమె ఈ డిసెంబర్ లో ఇపుడు రాయాల్సిన ఎగ్జామ్స్ ని వదులుకుందట. ఈసారి పరీక్షలు వదిలేసి సప్లిమెంటరీ రాసుకుంటానని ప్రస్తుతం గుంటూరు కారం షూట్ కంప్లీట్ చేసేయాలని డిసైడ్ అయ్యిందట. దీంతో తన వల్ల సినిమా రిలీజ్ కి ఇబ్బంది కాకూడదు అని తన డ్రీం స్టడీకి తప్పనిసరి పరిస్థితిలో బ్రేక్ ఇచ్చింది. దీనితో ఈ వార్త ఆమె విషయంలో వైరల్ గా మారింది.