ఆమె బాలయ్య కూతురు కాదట

బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో ఉండబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ మూవీలో బాలకృష్ణకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపిస్తోంది అనే ప్రచారం గత కొంతకాలంగా నడుస్తోంది. ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని, తండ్రి కూతుళ్ళ అనుబంధంతో ఈ స్టొరీని అనిల్ రావిపూడి ఆవిష్కరిస్తున్నారు అనే టాక్ నడిచింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంట. మూవీలో శ్రీలీల పాత్రని మంచి ప్రాధాన్యత అయితే ఉంటుందని తెలుస్తోంది.

కాని ఆమె పోషిస్తోంది బాలకృష్ణ కూతురు పాత్రలో కాదంట. ఆమె బాలకృష్ణకి ఒక ఫ్రెండ్ తరహా పాత్రలో నటిస్తుందని టాక్. మూవీలో శరత్ కుమార్ కూతురుగా శ్రీలీల పాత్ర ఉంటుందంట. అయితే బాలయ్య, శ్రీలీల పాత్రల మధ్య మంచి స్నేహబంధం ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆమెకి బాడీ గార్డ్ తరహా పాత్రలో బాలకృష్ణ కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల మాట.

అందుకే శ్రీలీల పాత్రని మూవీలో చాలా గోప్యంగా ఉంచుతున్నారని టాక్. అయితే ఈ మూవీ టీజర్ వస్తే శ్రీలీల పాత్ర ఏంటి అనేది రివీల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని అక్టోబర్ 9న ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ పూర్తయిన తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అఖండకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఆ సినిమా తెరకెక్కనుంది.