రొటీన్‌కు భిన్నంగా శ్రీవిష్ణు ‘స్వాగ్‌’!

రొటీన్‌ సినిమాలకు భిన్నంగా తనకంటూ డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు టాలీవుడ్‌ హీరో శ్రీ విష్ణు. ఈ హీరో ప్రస్తుతం ‘స్వాగ్‌’ అనే సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. బోరింగ్‌ కథలకు టాటా చెబుతూ.. సరికొత్త పంథాలో అచ్చ తెలుగు సినిమా అంటూ ఇప్పటికే గ్లింప్స్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ మూవీ నుంచి ఎగ్జయిటింగ్ అప్‌డేట్‌లు త్వరలోనే ఇవ్వబోతున్నట్లు చిత్రబృందం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తుండగా.. ఈ సినిమాకు హసిత్‌ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్‌ శంకరన్‌ సినిమాటోగ్రఫర్‌ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. జూలై మొదటి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.