శ్రీవిష్ణు చిత్ర టైటిల్‌ ‘స్వాగ్‌’

రొటీన్‌ సినిమాలకు భిన్నంగా తనకంటూ డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ హిట్లు కొట్టే టాలీవుడ్‌ హీరో శ్రీ విష్ణు తన 40వ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. శ్రీ విష్ణు ప్రస్తుతం ‘ఓం భీమ్‌ బుష్‌’ అంటూ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లైన్‌లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వ ప్రసాద్‌ నిర్మాతగా శ్రీవిష్ణు తన తదుపరి ప్రాజెక్ట్‌ను చేయబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాకు ‘స్వాగ్‌’ అనే టైటిల్‌ను అనౌన్స్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా టైటిల్‌ అనౌన్స్మెంట్‌ గ్లింప్స్‌ ను రిలీజ్‌ చేసి బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. బోరింగ్‌ కథలకు టాటా చెబుతూ.. సరికొత్త పంథాలో అచ్చ తెలుగు సినిమా శ్వాగణిక వంశానికి స్వాగతం అంటూ గ్లింప్స్‌ ను షేర్‌ చేశారు.

ఈ సినిమా చారిత్రక నేపథ్యం ఉన్న శ్వాగణిక వంశం కథ అని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాకు హసిత్‌ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్‌ శంకరన్‌ సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు.

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్‌ గోలి ఫస్ట్‌ కొలాబరేషన్‌లో వచ్చిన ‘రాజ రాజ చోర’ చిత్రం నవ్వుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్‌ నిర్మించబోయే కొత్త చిత్రం కోసం మళ్లీ వీరు కలిశారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రొడక్షన్‌ నెం.32 చిత్రానికి ‘స్వాగ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. స్టోరీ ఆఫ్‌ ది టైటిల్‌ ‘స్వాగ్‌’ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు.