టాలీవుడ్ సినిమాలో ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లలో ఇప్పుడు రేంజ్ లో సెన్సేషన్ గా మారిన హీరోయిన్ శ్రీలీల కూడా ఒకామె అని చెప్పాలి. అంతే కాకుండా శ్రీలీల ఇపుడు టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా నిలవగా శ్రీలీల అయితే ఇప్పుడు చేతిలో పదుల సంఖ్యలో భారీ ఆఫర్స్ ని అందుకుని అదరగొడుతుంది.
గడిచిన ఈ రెండు మూడు నెలల్లోనే ప్రతి నెల కూడా ఆమె సినిమా రిలీజ్ అవుతుండగా ఇంకా రానున్న నెలల్లో కూడా ఆమె సినిమాలే వరుసగా ఉన్నాయి. అయితే మనకి కూడా ఓ హీరోయిన్ గానే శ్రీలీల అందరికీ తెలుసు కానీ తన కెరీర్ పరంగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ని చెప్పినట్టుగా వైరల్ గా మారింది.
కాగా ఆమె ఇపుడు సినిమాలు చేస్తున్నప్పటికీ సినిమా అనేది తనకి ఎప్పటికీ ప్రధాన ఛాయిస్ కాదని ఆమె తెలిపింది. తనకి డాక్టర్ కావాలని ఎప్పుడు కూడా ఉండే కోరిక అదే తన ఫస్ట్ ఛాయస్ అని చెప్పుకొచ్చింది. అయితే ఆమె తన ఒక్కదాని విషయంలోనే కాకుండా ప్రతీ అమ్మాయి కూడా ఒక బ్యాకప్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలని.
ఆలాగైతేనే వారు తమ లైఫ్ లో సక్సెస్ అవుతారని శ్రీలీల అంటుంది. దీనితో శ్రీలీల కొన్నాళ్లలో సినిమాలు వదిలేసినా పెద్ద ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఇక ఈ నెలలో ఆమె ఆదికేశవ సినిమాతో పలకరించనుండగా వచ్చే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో “గుంటూరు కారం” సినిమాతో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది.