Trending : ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ మూవీలో అనురాగ్ కులకర్ణి పాడిన సూపర్ సాంగ్

SR-Kalyanamandapam new song is viral in social media

“ఎస్.ఆర్.కళ్యాణ మండపం” అనే సినిమా గురించి ఒక న్యూస్ నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఒకటే వైరల్ అవుతూ ఉంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరో. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ చిత్రంలో ఫస్ట్ సింగల్ చూసాలే కళ్లారా అంటూ సాగే సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్ ఎక్స్ 100 చిత్రానికి సంగీతాన్ని అందించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ కంపోజ్ చేసిన సెకండ్ సింగిల్ చుక్క‌ల చున్ని అనే లిరిక్ తో మెద‌ల‌య్యే ఈ సాంగ్ ని క్రేజి సింగ‌ర్ అనురాగ్ కులకర్ణి పాడారు . ఈ సాంగ్ ని గురువారం విడుద‌ల చేశారు. విడుదల చేసిన తరవాత నుండి ఈ సాంగ్ ఆందరికి బాగా నచ్చేయటంతో తెగ వైరల్ అయిపోయింది. టాక్సివాలా చిత్రం తో అంద‌ర్ని ఆక‌ట్టు‌కున్న ప్రియాంక జ‌వాల్క‌ర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.

Chukkala Chunni Lyrical - Kiran Abbavaram | Priyanka Jawalkar | Chaitan Bharadwaj | Anurag Kulkarni

 

ఈ చిత్రంలో హీరో కిర‌ణ్‌, హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ లు మధ్య వ‌చ్చే రొమాంటిక్ చిలిపి స‌న్నివేశాలు యూత్ ని ఆక‌ట్టుకునేలా తెరెకెక్కించినట్లుగా ఈ సాంగ్ ప్రోమోలో అర్ధమవుతున్నాయి. ఈ చిత్రం లో డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు చాలా మంచి పాత్రలో న‌టిస్తున్నారు. కిరణ్‌, సాయికుమార్, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మ‌ద్య వ‌చ్చే సన్నివేశాలు హ్రుద‌యాన్ని హ‌త్తుకునేలా వుండేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీధర్ గాదె డైరెక్ట్ చేసాడు.