‘అవెంజర్స్’ డైరెక్టర్ తీస్తున్న వరల్డ్ వైడ్ మూవీలో సూపర్ స్టార్ “ధనుష్”

South superstar Dhanush has bagged a role in the highly anticipated film ‘The Gray Man

గత నాలుగైదు సంవత్సరాల నుండి హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఇండియా మార్కెట్ మీద కన్నేస్తున్నారు. మన దేశంలో చిత్ర పరిశ్రమ చాలా పెద్దది. హాలీవుడ్ ప్రొడక్షన్స్ హౌస్ లు ఇంగ్లీష్ మూవీస్ కి వస్తున్న ఆదరణ మరియు కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మన ప్రేక్షకులని ఆకర్షించటానికి రకరకాల స్ట్రాటజీస్ ని అనుసరిస్తున్నారు. మన సినిమాలు విదేశాలలో కూడా మంచి కలెక్షన్స్ తో విజయాలు సాధిస్తున్నాయి. ప్రముఖ ఓటిటి సంస్థ “నెట్ ఫ్లెక్స్ ” క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా మూవీకి హైప్ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది.

South superstar Dhanush has bagged a role in the highly anticipated film ‘The Gray Man
South superstar Dhanush has bagged a role in the highly anticipated film ‘The Gray Man’

అందులో భాగంగా “అవెంజర్స్” లాంటి యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ తీసిన దర్శకద్వయం రుస్సో బ్రదర్స్ రూపొందించబోతున్న నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ లో తమిళ స్టార్ హీరో ధనుష్ ని ఒక ప్రధాన పాత్రకి సెలెక్ట్ చేశారు. ఈ మూవీలో క్రిస్ ఎవాన్స్ మరియు ర్యాన్ గోస్లింగ్ వంటి హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ మూవీలో ధనుష్ కూడా భాగమవటంతో ఇండియా లో కూడా ఈ మూవీ మీద అంచనాలు , ఆసక్తి పెరిగిపోతుంది.ధనుష్ బాలీవుడ్ లో కూడా ఒక సూపర్ హిట్ మూవీ తో ఉత్తరాది అభిమానులకి పరిచయస్తుడే .ఈ మూవీ కోసం ధనుష్ 45 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది. అయినా కూడా హాలీవుడ్ ఆఫర్ రావడంతో డేట్లు సర్దుబాటు చేసుకుని మరీ ఓకే చెప్పాడట.ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ బడ్జెట్ లో తీసి ప్రపంచమంతా విడుదల చేస్తుందట. ప్రస్తుతం ధనుష్ తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ లతో కలిసి ‘అతరంగి రే’ చిత్రంతో ధనుష్ బాలీవుడ్ లో మరో సినిమా కూడా చేస్తున్నాడు .