Sonali Bendre: ఎన్టీఆర్@30ద్వారా గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న ప్రేమికుల రోజు హీరోయిన్ ..!

Sonali Bendre : ప్రేమికుల రోజు సినిమా లో రోజా గా ఆకట్టుకున్న ఉత్తరాది భామ సోనాలీ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలైన సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు సరసన మురారి, చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా,బాలకృష్ణతో బ్రహ్మనాయుడు, శ్రీకాంత్ తో ఖడ్గం సినిమా చేసారు సోనాలీ.బాలీవుడ్ లో ఎక్కువ సినిమా లు చేసిన సోనాలి తెలుగు సినీ పరిశ్రమకు దూరమై దాదాపు 18 ఏళ్ళు అయిపోయింది.

ఇక సోనాలి క్యాన్సర్ భారిన పడటం అందరిని షాక్ కు గురిచేసింది.ఆ తర్వాత చికిత్స కోసం అమెరికా వెళ్లిన సోనాలి చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంది.చికిత్స లో తన జుట్టు మొత్తం రాలిపోయిన తను ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కొంది. అందరికి స్ఫూర్తి గా నిలిచింది. అయిన సినిమాలా వైపు చూడలేదు చాలా రోజులు సోనాలి. తన భర్త కొడుకుతో ఆనందంగా గడుపుతోంది.

ఇక ఇంతకు ముందు కూడా తెలుగు రీ ఎంట్రీ అవకాశం వచ్చిన ఎందుకో చేయలేదు. ఇక ఇపుడు కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా కోసం సోనాలీతో చర్చలు జరిపారట కొరటాల శివ.ఇక ఎన్టీఆర్ 30వ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడి గా ఆలియా భట్, జాన్వీ కపూర్ నటించనున్నారని భోగట్ట. ఇక ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు నటిస్తుండడంతో సోనాలి కూడా ఓకే చెప్పేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అన్ని కుదిరితే మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు 18ఏళ్ల తర్వాత సోనాలి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఖుష్ చేస్తుందేమో చూడాలి.