యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌తో మజా ఇవ్వడానికి రెడీ అయిన సాయి ధరమ్ తేజ్

solo brathuke so better trailer released

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా “సోలో బ్రతుకే సో బెటర్‌” ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ప్రేమ, పెళ్లి అంటే పడని తేజు, యూత్‌ తన దారిలో నడవాలని అనుకుంటూ వాళ్ళని మోటివేట్ చేస్తుంటాడు. అలా ఉన్న హీరోకి హీరోయిన్ నభా నటేష్ పరిచయం కావడంతో సినిమా కథ ఎలా మలుపు తిరిగింది అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా ఎంటర్‌టైనింగ్‌గా చూపించనున్నట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.కాగా బ్యాచ్‌లర్‌గా తనకు ఎంతో స్పూర్తినిచ్చే నటుడు ఆర్.నారాయణమూర్తి టీవీలో పెళ్లి చేసుకోవాలని యూత్‌కు చెబుతుండటంతో తేజు ఫ్యూజులు ఎగిరిపోయే కామెడీ సీన్‌తో ఈ ట్రైలర్‌ను ముగించారు.దర్శకుడు సుబ్బు ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడో అది స్పష్టంగా ట్రైలర్‌లో కనిపిస్తోంది.ఇక తేజు ఈ సినిమాలో చాలా బాగా నటించాడని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం.

https://www.youtube.com/watch?v=CtRvAZSQH5I

సాయిధరమ్‌ తేజ్‌, నభా నటేష్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సుబ్బు’ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌, నరేష్‌, సత్య, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించగా ఇటీవల థియేటర్లు తెరుచుకోవడంతో పెద్ద స్క్రీన్‌ మీద సందడి చేసేందుకు సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.