Home News డేర్ చేస్తున్న మెగా హీరో.. డిసెంబ‌ర్‌లోనే థియేట‌ర్‌లోకి వ‌స్తానంటున్న తేజ్

డేర్ చేస్తున్న మెగా హీరో.. డిసెంబ‌ర్‌లోనే థియేట‌ర్‌లోకి వ‌స్తానంటున్న తేజ్

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డ్డాయి. ప్ర‌జ‌ల‌కు వినోదం అనేది పూర్తిగా క‌రువైంది. ప్ర‌భుత్వం థియేట‌ర్స్ తెరిచేందుకు అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు థియేట‌ర్స్‌లో అడుగుపెట్టాలంటే భ‌య‌ప‌డుతున్నారు. మ‌రోవైపు థియేట‌ర్ యాజ‌మాన్యాలు కూడా సాహ‌సాలు చేయ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న తాజా చిత్రం సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాని డిసెంబ‌ర్‌లో థియేట‌ర్‌లోకి తీసుకొస్తానంటూ అఫీషియ‌ల్ ప్ర‌కట‌న ఇచ్చేశాడు. పెద్ద పెద్ద సినిమాలే రిస్క్ చేయ‌లేక ఓటీటీల బాట ప‌డుతుంటే మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ మాత్రం డేర్ చేస్తూ త‌న సినిమాని థియేట‌ర్‌లో విడుద‌ల చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు.

Solo Movie | Telugu Rajyam

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుండి విడుద‌లైన నో పెళ్లి సాంగ్‌కి ఎంత బాగా రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఈ సాంగ్‌కి త‌మ‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అల‌రించారు. ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం పోస్ట్ కోవిడ్ టైం లోను కొంత షూటింగ్ జ‌రుపుకుంది. కరోనా నిబంధ‌న‌లు పాటిస్తూ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు.

కొన్ని వారాల క్రితం సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోగా, ఈ రోజు సాయంత్రం చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌పై డిసెంబ‌ర్ లో చిత్రాన్ని థియేట‌ర్‌లో తీసుకురాబోతున్న‌ట్టు రాసి ఉంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఇన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్ళీ థియేట‌ర్‌లో సినిమాని చూడ‌బోతున్నామంటూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు

Related Posts

వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ...

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News