అదిరే పోస్టర్ తో “వాల్తేరు వీరయ్య” ట్రైలర్ రిలీజ్ సాలిడ్ అప్డేట్.!

waltair-veerayyas-pre-release-business-details-01

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి అలాగే మాస్ మహారాజ రవితేజ లు నటించిన మెగా – మాస్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” ఒకటి. యంగ్ దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో సిల్వర్ స్క్రీన్స్ ని హిట్ చేయనుండగా.

ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డే అయితే వచ్చేసింది. మరి లేటెస్ట్ గా ఈ మాస్ ట్రైలర్ రిలీజ్ టైం ని చిత్ర బృందం ఓ అదిరిపోయే పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు. సముద్ర తుఫాన్ లో పడవపై మెగాస్టార్ నిల్చొని బల్లెం విసురుతున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ పూనకాలు తెప్పించేలా ఉంది.

ఇక ఇందులోనే ఈ సినిమా ట్రైలర్ ని అయితే ఈరోజు సాయంత్రం 6:03 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఇప్పుడు క్రేజీ ట్రైలర్ కోసం మెగా అండ్ రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన కేథరిన్ నటించగా చిరు సరసన శృతి హాసన్ నటించింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.