అక్కినేని హీరో సినిమాలో మహేష్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఉందట.!

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరోలు అలాగే అక్కినేని అభిమానులు కూడా మంచి స్వింగ్ లో ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడం అలాగే నెక్స్ట్ కూడా అదిరిపోయే సినిమాలు రెడీగా ఉంటుండడంతో చాలా అంచనాలు పెట్టుకొని ఉన్నారు.

ఇక ఈ లిస్ట్ లో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం “థ్యాంక్ యూ” సినిమా ముందు విడుదలకి సిద్ధంగా ఉంది. మరి ఈ నెక్స్ట్ వీక్ లోనే రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఖాయం అని ఈ సినిమా మేకర్స్ అంటున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబుకి నాగ చైతన్య పెద్ద ఫ్యాన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ రకంగా ఈ సినిమాలో మహేష్ బాబు నటించిన మూడు సాలీడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు “ఒక్కడు, పోకిరి అలాగే దూకుడు” సినిమాలు రిఫరెన్స్ లు ఉంటాయట.

దీనితో మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఖాయం అని అంటున్నారు. ఇంకా ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా ఇంకా కొంతమంది యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ జూలై 22న రిలీజ్ చేస్తున్నారు.