ఇన్సైడ్ టాక్ : “రజినీ169” వ సినిమాకి అదిరిపోయే టైటిల్ పెట్టారా?

పాన్ ఇండియా సినిమా దగ్గర ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉండొచ్చు అలాగే ఎంతో మందిని సూపర్ స్టార్స్ అని పిలవొచ్చు కానీ అందరిని మించిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ అనే చెప్పాలి. తనదైన స్టార్డం మరియు సినిమాలతో ప్రపంచ సినిమాని తన వైపుకి తిప్పుకున్నారు. 

అయితే ఇప్పుడు రజినీకాంత్ తన కెరీర్ లో 169వ సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ హిట్ దర్శకుడు డాక్టర్, బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాపై ఇపుడు ఇండస్ట్రీ నుంచి ఓ బిగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి అదిరే టైటిల్ ని రజిని యుఫోరియా ని మ్యాచ్ చేసే విధంగా పెట్టారని తెలుస్తుంది. 

ఆ టైటిలే..”బాస్”. రజిని తాను నటించిన భారీ ఇండస్ట్రీ హిట్ “శివాజీ” కి కింద ది బాస్ అనే ట్యాగ్ ఉంటుంది. అది గుర్తు రాక మానదు ఇప్పుడు. మరి ఈ టైటిల్  అయ్యింది అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్, ఏ జి ఎస్ స్టూడియోస్ వారు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.