మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అన్న సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే రమేష్ వర్మ బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షసుడు అన్న సినిమాతో మంచి హిట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో రవితేజ – రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కబోతున్న ఈ తాజా చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. టైటిల్ తో పాటు రవితేజ ఎనర్జిటిక్ పోస్టర్ అందుకు కారణం అని చెప్పాలి. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాను 2021 లో దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో రవితేజ ని ఢీ కొట్టే పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నాడని తాజా సమాచారం. ఒకప్పుడు హీరోగా తెలుగు, తమిళ సినిమాలలో బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న అర్జున్ గత కొంత కాలంగా స్పెషల్ క్యారెక్టర్స్ లో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నటించిన లై అన్న సినిమాలో నెగిటివ్ రోల్ పోషించాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఇలా టాలీవుడ్ లో బడా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అర్జున్ కి ఇప్పుడు రవితేజ సినిమాలో విలన్ రోల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో రానుందని అంటున్నారు. ఇక రవితేజ సినిమాలో అర్జున్ నటిస్తుండటం కూడా సినిమా రేంజ్ పెరగడానికి ఒక కారణం అవుతుందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. మొత్తానికి దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాతో రవితేజ కి సాలీడ్ హిట్ ఇవ్వడం పక్కా అన్న టాక్ మొదలైంది. చూడాలి మరి రవితేజ కి గత కొంతకాలంగా సరైన హిట్స్ లేవు. ఇప్పటికే రిలీజ్ కి రెడీగా ఉన్న క్రాక్ సినిమాతో పాటు ఖిలాడీ సినిమా మీద రవితేజ ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.