అభిజిత్ ఫ్యాన్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి.. ఆ వీడియోపై సోహెల్ వివరణ

Sohel Reacted On Mehaboob Viral Video

సోహెల్ మెహబూబ్ ఓ వీడియోతో గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు. అందులో మెహబూబ్ ఏవేవో సైగలు చేశాడు.. మూడు వేళ్లు ఒక వేళ్లు చూపిస్తు.. డబ్బులు తీసుకురా అంటూ సైగలు చేసేస్తున్నాడు. అయితే సోహెల్ మూడో స్థానంలో బయటకు వచ్చి 25 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అలా సోహెల్ బయటకు రావడంతో మెహబూబ్ హింట్ కలిసి వచ్చిందని, ఇది అతి పెద్ద స్కామ్ అంటూ వీడియో తెగ షేర్ చేస్తున్నారు.

Sohel Reacted On Mehaboob Viral Video

ఆ వీడియోపై తాజాగా సోహెల్ క్లారిటీ ఇచ్చాడు. లైవ్‌లోకి వచ్చిన సోహెల్ వీడియో గురించి ప్రశ్నలు ఎదురవ్వడంతో స్పందించాడు. అందరూ ఆ వీడియోను పట్టుకుని ఏదో సైగలు చేశాడు.. స్కాం చేశాడని అంటున్నారు.. అలా ఎలా చేయగలం.. నేను మూడు స్థానంలో ఉన్నాను అని మెహబూబ్‌కు ఎలా తెలుస్తుంది.. వాడు అలా చేతులు ఎందుకు అన్నాడో తెలీదు. మీరు దాన్ని డబ్బులు తీసుకురా అని చెప్పాడని అంటున్నారు. కానీ అది నిజం కాదని సోహెల్ చెప్పుకొచ్చాడు.

నా పదేళ్ల కెరీర్ మీద ఒట్టేసి చెబుతున్నా.. అందులో ఎలాంటి మోసం లేదు. అది స్కాం కాదు.. అభిజిత్ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి.. దాంట్లో మోసం ఏం జరగలేదు.. అక్కడ నేను ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్య గురించి అడిగాను.. వాడు 300k అని చెప్పాడు. అక్కడ జరిగింది అంతే. మూడో స్థానంలో ఉంటే డబ్బులు ఇస్తారని డీల్ ఉంటుందని వాడికి ఎలా తెలుస్తుంది.. ఇప్పటికైనా అర్థం చేసుకుని నెగెటివ్ కామెంట్స్ చేయకండని సోహెల్ అభిజిత్ ఫ్యాన్స్‌ను కోరాడు.