బిగ్ బాస్ తొలి ఫైనలిస్టుని ప్రకటించి హౌస్ లో ఉత్కంఠ రేపిన నాగార్జున !

sohail is the first finalist for bigg boss finale

బిగ్ బాస్ ఫినాలేలో అడుగుపెట్టే ఐదుగురు ఫైనలిస్టుల్లో ఒక ఫైనలిస్టును శనివారం ప్రకటించారు నాగార్జున. బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. ఇంకో వారం రోజుల్లో బిగ్ బాస్ విజేత ఎవరో తేలిపోనుంది. ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ ఆట రంజుగా సాగుతోంది. బిగ్ బాస్ టాస్కుల్లో పాల్గొంటున్న ఇంటి సభ్యులు రకరకాల ఎమోషన్స్ ప్రదర్శిస్తున్నారు. గొడవ పడుతున్నారు, ప్రేమ కురిపించుకుంటున్నారు, సరదాగా ఉంటున్నారు.

sohail is the first finalist for bigg boss finale

ఇక విషయంలోకి వస్తే బిగ్ బాస్ విజేత కాగలిగిన ఐదుగురు సభ్యులలో ఒకరిని ప్రకటించి ఉత్కంఠకి తెరలేపిన నాగార్జున , అతను ఎవరో కాదు సోహెల్. స్టోర్ రూంలో ఉన్న బోర్డును అఖిల్‌ను తీసుకురమ్మని చెప్పారు నాగార్జు. ఆ బోర్డు ఎరుపు రంగు క్లాత్‌తో మూసి ఉంది. ఇంటి సభ్యులతోనే కౌంట్ డౌన్ లెక్కపెట్టించి అఖిల్‌తో ఆ క్లాస్ తీసి తొలి ఫైనలిస్ట్‌ను రివీల్ చేశారు. అయితే, అంతకు ముందు ఆ బోర్డుపై ఎవరి ఫొటో ఉంటుందో ఊహించమని అఖిల్‌ను అడిగారు నాగార్జున. సోహెల్ లేదంటే మోనల్ ఉండొచ్చని అఖిల్ గెస్ చేశాడు. మొత్తానికి అతని గెస్ నిజమైంది. మిగిలిన నలుగురు ఫైనలిస్ట్‌లు ఎవరు.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు రేపు తెలిసిపోనుంది. కాగా తనను తొలి ఫైనలిస్ట్ గా ప్రకటించడంతో సోహెల్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఇంటి సభ్యులు అందరినీ హగ్ చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు. తనతో గొడవ పడిన అరియానాను కూడా హగ్ చేసుకొని ముద్దాడాడు.