నేడు నందమూరి తారకరామారావు శతజయంతి కావడంతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.ఈరోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన రాజేంద్రప్రసాద్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరు రాజేంద్రప్రసాద్ స్వగ్రామం కూడా.ఇలా చిన్నప్పటి నుంచి ప్రతి రోజు ఉదయం లేస్తూనే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ఆయన ఇన్స్పిరేషన్ తోనే తాను కూడా ఇండస్ట్రీలోకి వచ్చానని రాజేంద్రప్రసాద్ ఎన్నోసార్లు వెల్లడించారు. ఎన్టీఆర్ సూచన మేరకే మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరానని ఆయన పెట్టిన బిక్ష ప్రస్తుతం నేను ఉన్న ఈ హోదా అంటూ ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.మన దగ్గర ఉన్న దానిని పది మందికి సహాయం చేయడమే మనం అతనికి సమర్పించే నిజమైన నివాళి అంటూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు .
కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ పక్కన ఉన్న వ్యక్తి తనని సమాజమే దేవాలయం అని చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ గురించి ఈయన తెలియజేశారు. ఈ రోజు కనుక మా పెద్దాయన బతికే ఉంటే ఆయనకు బంగారు పువ్వులతో పాదాభివందనం చేసే వాడిని, ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా తెలుగువారిపై ఉంటాయని రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గురించి వెల్లడించారు.