తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నఅల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయ్యారు.ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉండటమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఇలా అల్లు అర్జున్ బన్నీ ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పాలి.
భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు రావడం సర్వసాధారణం.అయితే అల్లు అర్జున్ బన్నీ విషయంలో కూడా ఇలాంటి గొడవలు చోటు చేసుకున్నాయని,ఒక విషయంలో స్నేహ రెడ్డి తనని బాగా తిట్టిందని అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా స్నేహా తనని తిట్టిన విషయాన్ని బయటకు చెప్పారు.ఇంతకీ స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ని ఎందుకు తిట్టింది అనే విషయానికి వస్తే అయాన్ పుట్టిన తర్వాత స్నేహ రెడ్డి తన కొడుకు విషయంలో చాలా కేరింగ్ తీసుకొని తనని బాగా నెగ్లెట్ చేసిందట.
ఇలా కొడుకు పట్ల ఎంతో కేరింగ్ ఉన్నటువంటి స్నేహ ఒకరోజు బయటకు వెళుతూ ఆయాన్ కి స్నానం చేయించమని తనకి చెప్పివెళ్లిందట అయితే తన కుమారుడికి స్నానం చేస్తున్న సమయంలో పొరపాటున కింద పడిపోయాడని ఆ విషయం తెలిసిన స్నేహ రెడ్డి అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మండిపడిందని తెలిపారు.అసలు నీకు చెప్పి వెళ్ళడం నాకు బుద్ధి లేదు అంటూ తనని తిట్టిందని అల్లు అర్జున్ తెలియజేశారు. కొడుకు పట్ల ప్రతి తల్లి ఇంత కేరింగ్ తీసుకుంటుందా అని తనకు అప్పుడు అర్థమైందని ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.