విడాకుల వార్తలకు చెక్ పెట్టిన స్నేహ.. పోస్ట్ వైరల్!

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే హీరోయిన్ స్నేహ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు తమిళ్ కన్నడ ఇండస్ట్రీలోని దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించిన స్నేహ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు బుల్లితెర షోలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. హీరోయిన్ స్నేహ తమిళ్ హీరో ప్రసన్న ని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరికి ఒక బాబు ఒక పాప ఉన్నారు. స్నేహ ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన ఫోటోలను ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇటీవలే స్నేహ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్నేహ కొన్ని కారణాలతో తన భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాతో పాటు తెలుగు తమిళ్ ఇండస్ట్రీ మీడియా కథనాల్లో చర్చ నడుస్తోంది. స్నేహ భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆమె మరో ఇంట్లో వేరుగా ఉంటోందంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించిన విషయం మరవకముందే స్నేహ దానికి సమాధానం గట్టిగా చెప్పిందని చెప్పొచ్చు.

స్నేహ తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అంటూ వస్తున్న దుష్ప్రచారానికి తెరదింపుతూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స్నేహ తన భర్తతో దిగిన ఫోటోని షేర్‌ చేసింది. ఇందులో స్నేహ తన భర్తతో క్లోజ్ గా ఉంటూ ముద్దు పెడుతున్న ఫోటోను ట్విన్నింగ్‌ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో స్నేహ తన భర్తతో విడాకులు తీసుకుంటుందంటూ వచ్చిన దుష్ప్రచారం అవాస్తవమని చెప్పకనే చెప్పినట్లు అయింది.స్నేహ తెలుగు వెండితెరపై రీఎంట్రీ తో సన్నాఫ్‌ సత్యమూర్తి,వినయ విధేయ రామ వంటి బ్లాక్ బాస్టర్ మూవీలో నటించింది.మరోవైపు తమిళంలో పాపులర్ వెండి ధర షో అయిన డాన్సు జోడీ డాన్సు షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.