బ్యూటీ కియారా అద్వానీ ఈ మధ్య గ్లామరస్ గా కనిపిస్తూ తెగ సందడి చేస్తుంది. తన అందచందాలతో స్పైసీ లుక్ తో కనిపించడానికి తనకు ఇష్టం వచ్చిన రీతిలో ఎలా అంటే అలా చేసేస్తోంది. తాజాగా ‘లక్ష్మీబాంబ్’ మూవీ నుంచి అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నటించిన ద్యుయట్ ‘బుర్జ్ ఖలీఫా’ వీడియో సాంగ్ ఇటీవల విడుదల ఆయన సంగతి తెలిసిందే.
పంజాబ్ అప్ బీట్ ట్రాక్ లో స్టైలిష్ డ్యాన్సుతో సాగే ఈ పాటలో కైరా స్పైసీ లుక్ వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటోంది. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పడు అక్షయ్-కియారా బుర్జ్ ఖలీఫా థీమ్ తో సాగే పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కైరా అద్వానీ ఈ పాటలో తనలోని స్టైలిష్ డ్యాన్సింగ్ స్కిల్సుతో తన అభిమానుల్లో జోష్ నింపుతోంది. “ఈ ఏడాది అతి పెద్ద డ్యాన్సు ట్రాక్ ను అందిస్తున్నాం. ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి” అంటూ తన ఇన్ స్టాలో సాంగ్ ను షేర్ చేసింది.
దుబాయి లో ఈ సాంగ్ షూటింగ్ గురించి కొన్ని విషయాలు చిట్ చాట్ లో షేర్ చేసుకుంది కైరా. ” సినిమా షెడ్యూల్ లో ‘బుర్జ్ ఖలీఫా’ పాట షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేశాం. ఫ్యాన్సీ ఔట్ ఫిట్ లో లొకేషన్ కు వచ్చాం. మంచులో చిఫాన్ సారీలో ఉండటం కష్టం. కానీ ఇక్కడ కాళ్లకు చెప్పులు లేకుండా మండే ఎండలో కాలిపోతున్న ఇసుకలో డ్యాన్సు చేయాల్సి వచ్చింది. కానీ కమర్షియల్ సినిమా చేస్తున్నపుడు ఇటువంటివి తప్పవని ఓ నటి గా తనకు తెలుసునని, అందుకే ఎంజాయ్ చేస్తూ ఆ పాట షూట్ లో పాల్గొన్నా”అని కైరా అద్వానీ చెప్పుకొచ్చింది.
అయితే ఈ స్పైసీ లుక్ కోసం తాను ఎంతగానో శ్రమించినట్టు చెబుతోంది. అందుకోసం నిద్రలేని రాత్రులెన్నో గడిపిందట. రాఘవా లారెన్సు డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీబాంబ్ ‘డిస్నీ+హాట్ స్టార్’ లో నవంబర్ 9న విడుదల కానుంది.