యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో నడుస్తోంది. ఒప్పుకున్న సినిమాలూ, ఎంచుకుంటున్న కథలూ ఆసక్తికరంగా వుంటున్నాయ్. అసలు సిసలు హిట్ ఒక్కటి పడితే చాలు, నిఖిల్‌ని ఆపడం ఎవ్వరి వల్లా కాదు ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో.
ఇదంతా ‘కార్తికేయ 2’ సినిమాతోనే సాధ్యమైంది నిఖిల్‌కి. అయితే, నిఖిల్ తాజా చిత్రం ‘స్పై’ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ సినిమా జూన్ 29న రిలీజ్ కానుంది. అయితే, సినిమా వర్క్ ఇంకా పెండింగ్‌లోనే వున్నందున రిలీజ్ కాస్త పోస్ట్‌పోన్ చేసుకోవాలని నిర్మాతలకు సూచించాడట నిఖిల్.
కానీ, నిర్మాతలు అనుకున్న డేట్‌కే సినిమా రిలీజ్ కావాలని పంతం పడుతున్నారట. దాంతో, నిఖిల్ ఈ మధ్య సినిమా ప్రమోషన్లకు సపోర్ట్ చేయడం లేదు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్‌ని ప్రమోట్ చేయడంలో నిఖిల్ లైట్ తీసుకున్నాడు.
దాంతో, పెండింగ్‌లో వున్న డబ్బింగ్ వర్క్‌ని వేరెవరితోనైనా పూర్తి చేసేద్దామని నిర్మాతలు అనుకున్నారట. దాంతో, దిగొచ్చాడు నిఖిల్. అయితే, ఈ తతంగం వెనకాల ఓ పెద్ద తలకాయ వున్నట్లు తెలుస్తోంది. ఆ పెద్ద తలకాయ నిఖిల్‌కి బ్రైన్ వాష్ చేశాడట. రెమ్యునరేషన్‌లోనూ కోత విధిస్తానని బెదిరించాడట. అసలింతకీ నిఖిల్ విషయంలో తెర వెనక ఏం జరుగుతోంది.?