ఫ్లాష్‌ బ్యాక్‌ కథగా ‘స్కంద 2’ రూపొందనుంది

ఊర మాస్‌ సినిమాలకి కేరాఫ్‌ అడ్రెస్‌ లాంటి సినిమాలు చేసే ఏకైక డైరెక్టర్‌ బోయపాటి శ్రీను. బీగోపాల్‌, వినాయక్‌, రాజమౌళిల మాస్‌ ర్యాంపేజ్‌ తగ్గిన తర్వాత వారిని మించే రేంజులో మాస్‌ సినిమాలు చేస్తున్నాడు బోయపాటి శ్రీను. బాలయ్యని సింహ, లెజెండ్‌, అఖండగా చూపించి సాలిడ్‌ హిట్స్‌ కొట్టిన బోయపాటి.. వెంకీని తులసి చేసాడు, అల్లు అర్జున్‌ ని సరైనోడు అన్నాడు ఇప్పుడు రామ్‌ పోతినేనిని స్కందగా ప్రెజెంట్‌ చేసాడు.

పార్ట్‌ 1 ఎండ్‌ లో ‘స్కంద’ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని బోయపాటి శ్రీను చెప్పేసాడు. ట్రైలర్‌ లో చూపించిన ఒక వైల్డ్‌ క్యారెక్టర్‌ ని ఫ్లాష్‌ బ్యాక్‌ కథగా ‘స్కంద 2’ రూపొందనుంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘స్కంద’ నుంచి బయటకి వచ్చి సూర్య, బాలయ్యలతో చేయాల్సిన సినిమాలని స్టార్ట్‌ చేసే అవకాశం ఉంది.

ఈ రెండు సినిమాల్లో బోయపాటి ఏది ముందు స్టార్ట్‌ చేస్తాడో తెలియదు కానీ ఈ రెండు కంప్లీట్‌ అయ్యాకే ‘స్కంద 2’ స్టార్ట్‌ అవ్వనుంది. అయితే అసలు నిజంగానే ‘స్కంద 2’ ఉంటుందా లేక ఇది జస్ట్‌ హైప్‌ కోసం అలా ఓపెన్‌ ఎండ్‌ ఇచ్చి బోయపాటి శ్రీను ఎండ్‌ కార్డ్‌ వేశాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. !!