మరో మలయాళీ మూవీపై కన్నేసిన సితార

టాలీవుడ్ లో బడా నిర్మాత సంస్థగా ఉన్న సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మినిమమ్ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. టైర్ 2 హీరోలతో సితార నుంచి నాగ వంశీ ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. తమిళ్ హిట్ మూవీ ప్రేమమ్ రీమేక్ సినిమా ఈ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి మూవీ. ఆ తరువాత బాబు బంగారం అనే సినిమా మారుతి దర్శకత్వంలో చేశారు. రీసెంట్ గా తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సార్ అనే మూవీని తెరకెక్కించి ప్రేక్షకులకి అందించారు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో మలయాళీ హిట్ మూవీస్ పై సితార నిర్మాత నాగ వంశీ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానాతో అయ్యప్పన్ `కోశియమ్ ని భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ మంచి హిట్ అయ్యింది. అయితే లో బడ్జెట్ మూవీ కప్పెలని బుట్టబొమ్మ పేరుతో రీమేక్ చేశారు.

అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు మరో మలయాళీ హిట్ మూవీ రీమేక్ రైట్స్ ని సితార సొంతం చేసుకుందని తెలుస్తుంది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోనాల్ లాల్ హీరోగా హృదయం అనే సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కళ్యాణి ప్రియదర్శన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ రీమేక్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. దీనిని తెలుగులో మినిమమ్ బడ్జెట్ తో ఓ యంగ్ హీరోగా రీమేక్ చేయాలని నిర్మాత నాగ వంశీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి కథలకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో తక్కువ బడ్జెట్ తో రీమేక్ చేసి రిలీజ్ చేస్తే కచ్చితంగా మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది.