యూట్యూబ్ లో వైరల్ అవుతున్న సీతారామం డిలీట్ సీన్.. ఈ సీన్ ఉంటే సినిమా మరొక లెవెల్..?

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవల విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో సంచలనాలు సృష్టించింది. ఒక అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి వసూలు సాధించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమా నుండి బయటపడలేదంటే .. ఆ సినిమా ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో చెప్పనవసరం లేదు.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసుని హత్తుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇది ఇలా ఉండగా సీతారామం సినిమా నుండి డిలీట్ చేసిన కొన్ని సీన్లను ఇటీవల యూట్యూబ్లో విడుదల చేస్తున్నారు. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా కొన్ని సీన్లను డిలీట్ చేస్తుంటారు. అలా సీతారామం సినిమా నుండి డిలీట్ చేసిన సీన్లను చిత్ర బృందం ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా నుండి డిలీట్ చేసిన ఒక సన్నివేశాన్ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సుమంత్ దుల్కర్ సల్మాన్ మధ్య ఉన్న సన్నివేశాన్ని యూట్యూబ్లో విడుదల చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో రిలీజ్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు నాలుగు లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోలో సుమంత్, సల్మాన్ మధ్య ఉన్న సన్నివేశం ప్రేక్షకులను బాగా ఎమోషనల్ గా ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు.. ఈ సీన్ సినిమాలో ఉంటే సినిమా మరొక లెవెల్ లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.