తెలుగు సినీ పరిశ్రమలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు తమ ప్రత్యేకతను నిరూపించుకున్నాయి. బలమైన కథలు, గొప్ప నటీనటుల ఎంపిక, హై-క్వాలిటీ నిర్మాణంతో ఈ బ్యానర్లు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన ఈ సంస్థలు రాబోయే ప్రాజెక్ట్స్‌తో మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
సంస్థల లైనప్ చూస్తే.. మొదటిగా బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. బాబీ కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే బిగ్ బజ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న VD 12 ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఇది రెండు భాగాలుగా రానుండడం సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది.
అంతేకాకుండా, ఈ సంస్థలు సమ్మర్ సీజన్‌లో మ్యాడ్ స్క్వేర్, మాస్ జాతర వంటి ప్రాజెక్టులను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ లిస్టులో మరో స్పెషల్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం. ఇది పూర్తిస్థాయి పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందనుంది. ఇక, తారకరత్న, విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ, అశోక్ గల్లా వంటి యువ నటులతో పాటు సూర్య, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.
ఈ రెండు సంస్థలు ప్రతిసారీ వినూత్న కథలతో వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు వారి సినిమాలు నైపుణ్యం, వినోదాన్ని కలిపి ప్రేక్షకులను అలరించాయి. రాబోయే ప్రాజెక్ట్స్‌తో ఈ బ్యానర్లు మరింతగా పాపులారిటీని సంపాదించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి, ఈ రెండు సంస్థల లైనప్ చూస్తే భవిష్యత్‌లో ప్రేక్షకులను వినోదం కల్పించడంలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తాయని చెప్పడం తప్పు కాదు. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్టులపై ఉంది.