ఆది పురుష్ లో సీత ఫిక్స్ ..అందరి అంచనాలు తారుమారు ..?

ప్రభాస్ రాముడిగా, సైఫ్ లంకేష్ గా నటించతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా ఆది పురుష్. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది. అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి 750 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయించినట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే సీత పాత్రలో ఏ స్టార్ హీరోయిన్ కనిపంచబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఒక్క సీత పాత్ర నే కాదు మరో ప్రధాన పాత్రలు అయిన లక్ష్మణ, హనుమ రోల్స్ కు సంబంధించి అప్‌డేట్స్ కూడా ఈ నెల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ముందుగా ఈ సినిమాలో సీత గా నటించబోతున్న హీరోయిన్ ని రివీల్ చేయనున్నారని సమాచారం. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23 న ఈ సస్పెన్స్ కి తెర దించబోతున్నారు.

అయితే సర్వాత్రా ఈ సినిమాలో సీతగా నటించబోయేదేది ఎవరన్నది ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమలలోను ఆసక్తికరమైన చర్చలు సాగుతుండగా కీర్తి సురేష్ అయితే సీతగా సరిగ్గా సరిపోతుందని మేజారిటీ జనాలు భావిస్తున్నారు. అలాగే పూజా హెగ్డే ఇప్పటికే బాలీవుడ్ లో ఒక పీరియాడికల్ మూవీ చేసింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తుంది.

ఇక ప్రభాస్ తో రాధే శ్యామ్ కూడా చేస్తుండగా ఆది పురుష్ లోనూ పూజా హెగ్డే సీతగా కనిపించబోతుందని వార్తలు వచ్చాయి. కాని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కియారా అద్వానీ నే ఆదిపురుష్ లో సీతగా ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని ప్రభాస్ బర్త్ డే 23 న అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించనున్నారని సమాచారం.