బిగ్‌బాస్‌ 4పై సునీత రియాక్షన్.. చేతులెత్తి దండం పెట్టేసింది!!

Singer Sunitha Condemns Rumors On bigg boss 4 telugu

ప్రస్తుతం బిగ్ బాస్ నాల్గో సీజన్ సందడి మొదలైంది. ఇక ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైందని సమాచారం. ఈ ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం ఆరు గంటలకు అంగరంగ వైభవంగా మొదలుకాబోతోంది. అయితే ఇప్పటికే ఓ లిస్ట్ ప్రచారంలో ఉంది. అందులో కొందరు కొత్తగా యాడ్ అవుతున్నారు.. ఇంకొందరు సైడ్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోకరు తప్పుడు వార్తలపై స్పందించారు.

Singer Sunitha Condemns Rumors On bigg boss 4 telugu
Singer Sunitha Condemns Rumors On bigg boss 4 telugu

పదిహేను, పదహారు మంది కంటెస్టెంట్లతో దాదాపు వంద రోజుల పాటు ఈ నాలుగో సీజన్ నడవనుందని టాక్. అయితే ఈ కంటెస్టెంట్ల లిస్ట్‌లో పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. షో దగ్గర పడుతున్న కొద్దీ సస్పెన్స్ పెరిగిపోతోంది. ఇప్పటికే లీకైన సమాచారం మేరకు.. నోయెల్, దేత్తడి హారిక, దివి, లాస్య, గంగవ్వ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లి, సోహెల్, ముక్కు అవినాష్, దిల్ సే మెహబూబా, రఘు మాస్టర్, ఆరియానా, యాంకర్ సుజాత, మోనాల్, అభిజీత్ వంటి వారున్నారని తెలుస్తోంది.

వీరిలో రఘు మాస్టర్ పేరు మళ్లీ క్యాన్సిల్ అయింది. ఇక నోయల్, గంగవ్వ, హారిక వంటి వారికి కరోనా పాజిటివ్ అని వచ్చిందట. తాజాగా సునీత పేరు కూడా ఈ లిస్ట్‌లో వినిపించడంతో నేరుగా ఆమె రంగంలోకి దిగింది. బిగ్ బాస్ గురించి వస్తోన్న వార్తలను సునీత ఖండించింది. డియర్ ఫ్రెండ్స్, నేను బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొనబోవడం లేదు.. పాల్గొనబోను కూడా అంటూ దండం పెడుతూ.. మీ ఈ సంగతి తెలియడానికి ఈ పోస్ట్ పెడుతున్న అని చెప్పుకొచ్చింది.