చిన్మయి శ్రీపాద.. సింగర్ మాత్రమే కాదు డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ కూడా. సమంతకు వాయిస్ చెప్పేది ఈమే. చిన్మయి శ్రీపాద కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది చిన్మయి.
మీటూ ఉద్యమం మొదలైనప్పుడు కూడా సెలబ్రిటీలపై జరుగుతున్న లైంగిక దాడులను ఆమె ఖండించింది. తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో కొందరు తనను లైంగికంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసింది.
తాజాగా.. ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఆ పోస్ట్ ఎవరిదంటే.. సోఫియా అక్కర అనే సింగర్ గురించి. ఆమెది స్విట్జర్లాండ్. కాకపోతే ఇండియన్ సాంగ్స్ కూడా పాడుతుంది. మీటూ ఉద్యమం సాగుతున్న సమయంలో సోఫియా.. తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని చిన్మయితో పంచుకున్నదట.
ఇప్పుడు చిన్మయి దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ సంఘటన సంచలనంగా మారింది.
చిన్మయి పోస్ట్ ప్రకారం… సోఫియాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. ఇండియాకు చెందిన ఓ ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ను కలిసే అవకాశం వచ్చిందట. నిజానికి ఆయనతో కలిసి ఓ సినిమాకు పనిచేసే అవకాశం రావడంతో ఆయన్ను ఓసారి సోఫియా కలిసింది.
ఆయన వయసులోనూ చాలా పెద్దవారు. పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. ముందు ఆయన తన స్కైప్ ఐడీ అడిగారట. ఆ తర్వాత సోఫియాను స్కైప్ లోకి రమ్మన్నారట. వచ్చాక.. సోఫియాను బట్టలు మొత్తం విప్పేసి.. నగ్నంగా నిలుచోవాలంటూ కోరాడట.
దాంతో షాక్ అయిన సోఫియా.. మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? ఈ విషయం నేను అందరికీ చెబుతా? అని సోఫియా అనగానే.. ఏమాత్రం బయపడకుండా.. నీ మాటలు ఎవ్వరూ నమ్మరు.. అంటూ ఆ సింగర్ బెదిరించాడని సోఫియా తనతో చెప్పిందని చిన్మయి తన పోస్ట్ లో పేర్కొంది.
అయితే.. మీటూ ఉద్యమం సమయంలోనే ఆ పోస్ట్ ను చిన్మయి పోస్ట్ చేసినప్పటికీ.. మళ్లీ ఓసారి రీపోస్ట్ చేసింది చిన్మయి. తన పోస్ట్ ను రీపోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు.. అంటూ సోఫియా కూడా రెస్పాండ్ అయింది.