ఆ సాంగ్స్ హిట్ అయ్యాయి కాబట్టి ఈ సాంగ్ కూడా హిట్ అవుతుంది.. దబిడి దిబిడి సాంగ్ ని వెనకేసుకొస్తున్న బాలయ్య ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి డైరెక్ష్న్ రాబోతున్న ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ విడుదల అవుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే దబిడి దిబిడి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట విడుదలైనప్పటి నుంచి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అలాగే ట్రోలింగ్ కూడా గురవుతోంది.

హీరోయిన్ నడుము, పిరుదులపై బాలయ్య దరువు వేయడంతో పాటు నాభి భాగంలో చేయి వేసి ఊర్వశి డ్రెస్‌ను పట్టుకునే సీన్ ఉండటంతో నెటిజన్లు మరోసారి రెచ్చిపోతున్నారు. కూతురు వయసున్న హీరోయిన్‌తో ఇలాంటి స్టెప్స్ వేస్తారా? కొరియోగ్రాఫర్‌కు బుద్ధి ఉందా అంటూ ట్రోలింగ్‌తో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ కామెంట్స్ ని తిప్పికొడుతూ బాలయ్యని వెనకేసుకొస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

మహేష్ బాబు కుర్చీని మడక పెడుతూ సాంగ్, అల్లు అర్జున్ ఫీలింగ్స్ సాంగ్ తోనూ ముడి పెడుతూ ఆ రెండు పాటలు రిలీజ్ అయినప్పుడు ఇలాగే ట్రోల్ చేశారు అది హిట్ అయ్యాయి ఇప్పుడు డాకు మహారాజ్ సాంగ్ కూడా ట్రోల్ చేస్తున్నారు.ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఒక ట్వీట్ వదిలారు.” గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి హిట్, పుష్ప 2లో పీలింగ్స్ సాంగ్ హిట్, డాకు మహారాజ్‌లో దబిడి దిబిడి హిట్.. ఈ మూడు పాటలు రిలీజైనప్పుడు తిట్టారు, ట్రోలింగ్ చేశారు.

పై రెండు సినిమాలు హిట్.. ఇప్పుడు డాకు మహారాజ్ కూడా హిట్”” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ , సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.