Ram pothineni : వారియర్ కు తమిళ హీరో శింబు సహాయం…. జులై లో రాబోతున్న రామ్ కొత్త చిత్రం…!

Ram pothineni : ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వారియర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.ఇక రామ్ కు విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఇక వారియర్ సినిమాకు తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది.ఇక రామ్ బోయపాటి తో మరో సినిమా చేయబోతున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు.

హై వోల్టెజ్ ఎనర్జెటిక్ హీరో కి ఊర మాస్ దర్శకుడు తోడవడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక రామ ప్రస్తుతం నటిస్తున్న వారియర్ లో రామ్ మతిమరుపు జబ్బుతో బాధపడే వ్యక్తిగా అలరించనున్నాడు. ఈ సినిమాలో రామ్ కు జంటగా క్రితి శెట్టి, అక్షరా గౌడ్ నటిస్తున్నారు.తన మతిమరుపు కారణంగా తనకు తెలియకుండానే సమస్యల్లోకి ఇలా ఇరుక్కున్నాడు, వాటి నుండి ఇలా బయట పడ్డాడు అన్నదే కథాంశం గా వారియర్ వస్తోంది.

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. రామ్ వారియర్ సినిమాలో ‘బుల్లెట్ బండి’అనే పాటను తమిళ హీరో శింబు పాడారు.గతంలో కూడా శింబు తెలుగు హీరోల కోసం పాడారు.మనోజ్ సినిమాలోనూ, ఎన్టీఆర్ సినిమాలోనూ పాట పాడారు.సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.ఇక వారియర్ సినిమా జులై 14 న విడుదలకు సిద్ధమవుతోంది.