త్వరలో మెగా ఫోన్ పట్టనున్న శృతి హాసన్

latest photos of shruti hassan goes viral

శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను, ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు. ఓ సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ కూడా. ఆమె తన తండ్రి సినిమాలకు మ్యూజిక్‌ను కూడా అందించింది. ఇక తాజాగా శృతి హాసన్ రైటర్‌గా మారిందట. ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్న శృతి హాసన్ తాజాగా ఓ కథను రాసిందట. అందులో భాగంగా ఇప్పటికే తను రాసిపెట్టుకున్న లైన్స్‌ని బౌండెడ్ స్క్రిప్ట్‌గా మార్చబోతున్నట్టు చెబుతోంది. అంతేకాదు అన్ని కుదిరితే ఆ కథను డైరెక్ట్ కూడా చేసే ఆలోచనలో ఉందట శృతి హాసన్.

latest photos of shruti hassan goes viral

ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న శృతి హాసన్ ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి మళ్లీ రీసెంట్‌గా రవితేజ క్రాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సాలీడ్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సస్ తర్వాత శృతి హాసన్‌ వరసగా భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలు అందుకుంటోంది. అయితే మొదట్లో వరుస సినిమాలతో ఇటు తెలుగు అటు తమిళ సినిమాల్లో అలరించినా శృతి హాసన్ ఆ మధ్య సినిమాలే చేయడం మానేసింది. దీనికి కారణం వరుసగా సినిమాలను చేయడం.. అవి సరిగా ఆకట్టుకోకపోవడంతో ఆ మధ్య పెద్దగా అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం ఈ భామ కెరీర్ పుంజుకుంది. వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. వకీల్ సాబ్ సినిమా వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు శృతి హాసన్ తెలుగులో మరో సినిమాలో కూడా నటిస్తోంది. ప్రభాస్ సలార్‌లో కీలకపాత్రలో కనిపించనుంది శృతి.ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఇక శృతి ఓ పక్కా సినిమాలు చేస్తూనే మరోవైపు.. ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.