ప్రియుడుతో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన శృతిహాసన్.. ఈ పని చేస్తే ఎప్పటికీ విడిపోరంటూ కామెంట్?

సౌత్ ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ కుమార్తెగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి శృతిహాసన్. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న శృతిహాసన్ శంతను హజారిక అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడుతో కలిసి పెద్ద ఎత్తున రద్దు చేస్తూ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ విధంగా శృతిహాసన్ నిత్యం తన ప్రియుడుతో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.అయితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఇద్దరు సహజీవనం చేస్తూ ఉన్నప్పటికీ ప్రేమలో తానే ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి ఈ ముద్దుగుమ్మ మాట దాటేస్తున్నారు.తనకు పెళ్లి అంటే తెలియని ఆందోళన అని అందుకే పెళ్లి కంటే ప్రేమే ముద్దు అంటూ ఈ ముద్దుగుమ్మ వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ జోడించారు.

తన ప్రియుడితో కలిసి జిమ్ లో భారీగా వర్కౌట్స్ చేస్తున్న శృతిహాసన్ ఇద్దరు కలిసి సెల్ఫీకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన శృతిహాసన్ లవర్స్ ఎప్పుడు విడిపోకుండా కలిసి ఉండాలంటే తరచూ వీరిద్దరూ కలిసి ఒకే చోట భోజనం చేయడం వర్కౌట్ చేయడం వంటివి చేయడం వల్ల లవర్స్ ఎప్పటికీ విడిపోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ పోస్ట్ పలువురు నెటిజనులు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.