సంక్రాంతి హీరోయిన్.! ప్చ్.. లాభం లేదు శృతిహాసన్.!

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలొచ్చాయ్ శృతిహాసన్ నుంచి. బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోనూ, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోనూ  హీరోయిన్ శృతిహాసన్.. కానీ, ఏం లాభం.? అనారోగ్య సమస్యల కారణంగా, మంచి టైమ్ మిస్ అయ్యిందామె.

సినిమాలు బాగా ఆడాయ్.. అయినాగానీ, శృతిహాసన్ గురించి ఎక్కడా డిస్కషన్ లేదు. ఒకవేళ సినిమా ప్రమోషన్లలో శృతిహాసన్ పాల్గొని వుంటే, ఆమెకు విపరీతమైన మైలేజ్ వచ్చేది.

ఇదిలా వుంటే, ఈ రెండు సినిమాలకు ముందు శృతిహాసన్ ఓ యంగ్ హీరోతో జతకట్టేందుకు దాదాపుగా ‘ఓకే’ చేసుకుంది. కానీ, ఇప్పుడా ప్రాజెక్ట్ ఆమె చేజారిపోయిందని తెలుస్తోంది.

‘పెద్ద హీరోల పక్కన చేసేసింది.. ఈ సినిమాలో నాకంటే ఏజ్డ్‌గా కనిపిస్తుంది..’ అని యంగ్ హీరో, నిర్మాత వద్ద అనుమానం వ్యక్తం చేశాడట. అలా ఆ ప్రాజెక్టు ఆమె చేజారిపోయిందని అంటున్నారు. ఎవరా యంగ్ హీరో.? జస్ట్ గెస్.!