మీకు గుర్తుందా? మెంటల్ హై క్యా సినిమా గుర్తుందా? అదేనండి.. కంగనా రనౌత్ నటించిన… జడ్జిమెంటల్ హై క్యా అనే సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమాలో కంగనా చేసిన పిచ్చి చేష్టలు గుర్తున్నాయా మీకు.
ఇప్పుడు శృతి హాసన్ కూడా సేమ్ అలాగే ఆ సినిమాలో కంగనా ఎలా చేసిందో… రియల్ లైఫ్ లో శృతి అలా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి కారణం ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోనే.
ఆమె షేర్ చేసిన ఫోటోను చూసిన నెటిజన్లను ముందు మెంటల్ ఎక్కింది. డార్క్ లిప్ స్టిక్ పెట్టుకొని పెదాలు తిప్పుతూ.. పిచ్చి చేష్టలు చేస్తూ ఫోటో తీసుకొని దానికి మండే మూడ్ అంటూ ఓ క్యాప్షన్ తగిలించి సోషల్ మీడియాలో వదిలింది శృతి.
వామ్మో.. ఇదేం ఫోటో దేవుడా. చిన్నపిల్లలు చూస్తే దడుసుకునేలా ఉన్నారు. ఇలాంటి ఫోటోలు పెట్టి మమ్మల్ని భయపెట్టకమ్మా. నీమీద ఉన్న కాస్తో కూస్తో అభిమానం కూడా చచ్చిపోయేలా ఉంది. ఈ ఏజ్ అలో నీకు ఈ పాట్లు ఎందుకు తల్లీ. కొంపదీసి సినిమా అవకాశాల కోసం కాదు కదా. లేదంటే యూత్ ను ఆకర్షిద్దామనా? సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుందామనా? ఏంది నీ బాధ అసలు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నిజానికి.. చీరకట్టులో శృతి హాసన్ అందానికి కొదవ ఉండదు. ఆమె నటించిన గబ్బర్ సింగ్ సినిమానే దానికి ఉదాహరణ. గబ్బర్ సింగ్ లో చీర కట్టులో కనిపించీ కనిపించకుండా నడుమును చూపిస్తూ కుర్రకారుకు మతి పోగొట్టేసిన ఆ శృతి హాసనేనా ఇలాంటి పిచ్చి ఫోటో పెట్టింది అని శృతి ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
ఇక.. ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో అయితే ఏం సినిమాలు లేవు. కరోనాతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది.