క్రాక్ తో శృతి హాసన్ ఎంత పెంచేసిందో.. అయినా బాగానే ఉందట ..?

క్రాక్ తో శృతి హాసన్ మళ్ళీ ఫాం లోకి వచ్చిన సంగతి తెలిసిందే.కమల్ హాసన్ కూతురిగా లక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది శృతి హాసన్. ఆ తర్వాత తెలుగులో అనగనగా ఓ ధీరుడు.. ఓ మై ఫెండ్ సినిమాలు చేసింది. కాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఐరెన్ లెగ్ అన్న ముద్ర నుంచి లక్కీ హీరోయిన్ గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఒక వెలుగు వెలిగింది.

అయితే కాటమరాయుడు సినిమా తర్వాత దాదాపు టాలీవుడ్ లో మూడేళ్ళు గ్యాప్ వచ్చింది శృతి హాసన్ కి. ఇక సినిమాలకి శృతి హాసన్ గుడ్ బాయ్ చెప్పిందన్న టాక్ కూడా వినిపించింది. కానీ సడన్ షాకిస్తూ క్రాక్ అండ్ వకీల్ సాబ్ సినిమాలలో ఛాన్స్ అందుకుంది. వకీల్ సాబ్ ఇంకా రిలీజ్ కాలేదు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ ఏప్రిల్ లో రిలీజ్ కానుండగా ఇప్పటికే క్రాక్ సినిమా తో భారీ హిట్ అందుకుంది. ఊహించని విధంగా ఈ సినిమాతో మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో కూడా వరసగా అవకాశాలు అందుకుంటోంది.

తమిళంలో విజయ్ సేతుపతి కి జంటగా లాభం అన్న సినిమా చేసింది. ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ గా ఉంది. కాగా ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ అన్న భారి యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చింది. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా క్రాక్ తో సక్సస్ ట్రాక్ ఎక్కిన శృతి హాసన్ కోటి పైగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారట. ఇక సలార్ కోసం శృతి హాసన్ బల్క్ డేట్స్ కేటాయించిందని తెలుస్తోంది.