చిరు తో సాంగ్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్.?

ప్రస్తుతం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా “వాల్తేరు వీరయ్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని మెగా ఫ్యాన్ బాబీ తెరకెక్కిస్తుండగా గ్లామరస్ బ్యూటీ హీరోయిన్ శృతి హాసన్ అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా కోసం మేకర్స్ అంతా చాలా కొత్త కొత్త ప్రదేశాల్లో పాటలు చేసిన సంగతి తెలిసిందే. అలా రీసెంట్ గా ఓ ప్లేస్ కి వెళ్లి చిత్ర యూనిట్ శ్రీదేవి చిరంజీవి అనే బ్యూటిఫుల్ సాంగ్ ని చిత్రీకరించారు. మైనస్ డిగ్రీలలో మొత్తం మంచు తో ఉండే ఈ సాంగ్ పై శృతి హాసన్ లేటెస్ట్ గా పలు షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.

తాను రీసెంట్ టైం లో అయితే వాల్తేరు వీరయ్య లో శ్రీదేవి చిరంజీవి సాంగ్ అంత కంఫర్టబుల్ గా నాకు అనిపించలేదు అని ఈ సాంగ్ కి వర్క్ చేయడం నాకు అంతగా నచ్చలేదు అన్నట్టుగా శృతి కామెంట్ చేసిందట. దీనితో ఈ స్టేట్మెంట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

మరి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మాస్ మహారాజ రవితేజ కూడా గెస్ట్ రోల్ లో నటిస్తుండగా తన సరసన క్యాథెరిన్ నటిస్తుంది. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 13 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.