మెగాస్టార్ తో శ్రియ ఐటెమ్ సాంగ్

టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా తన ప్రస్థానం కొనసాగించిన అందాల భామ శ్రియ శరన్. ఇష్టం సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆరంభంలోనే ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ అయిపొయింది.

తెలుగులో స్టార్స్ గా హీరోలలో చాలా మందితో ఈ అమ్మడు ఆడిపాడింది. ఇదిలా ఉంటే హీరోయిన్ గా కెరియర్ ఎండ్ అయ్యే టైమ్ లో రష్యాకి చెందిన బాడ్మింటన్ కీడాకారుడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం కూతురుకి కూడా జన్మనిచ్చింది. కూతురు పుట్టిన తర్వాత శ్రియ కొంత కాలం గ్యాప్ ఇచ్చి మరల నటిగా బిజీ అయ్యే ప్రయత్నం మొదలు పెట్టింది.

ఈ బ్యూటీ గత ఏడాది హిందీలో దృశ్యం 2 మూవీలో అజయ్ దేవగన్ కి జోడీగా నటించి హిట్ కొట్టింది. ఈ ఏడాది కబ్జా అనే సినిమాలో ఉపేంద్రకి జోడీగా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో స్పీడ్ పెంచిన శ్రియ రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో హీట్ పెంచుతోంది.

అందాల ప్రదర్శనలో హద్దులు పెట్టుకోకుండా అందరికి కావాల్సినంత నేత్రానందం అందిస్తోంది. ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు ఐటెమ్ సాంగ్స్ చేయడానికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భోళా శంకర్ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం శ్రియ శరన్ ని సంప్రదిస్తున్నారంట.

ఆమె కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో చేయడానికి సుముఖంగానే ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్. వాల్తేర్ వీరయ్య సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ తో ఐటెమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు ఆ అవకాశం శ్రియకి రావడం విశేషం. మొత్తానికి కెరియర్ ఆరంభంలో ఠాగూర్ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా నటిస్తే ఇన్నేళ్ళ తర్వాత ఐటెం సాంగ్ చేసే అవకాశం శ్రియకి రావడం విశేషం.