గే పాత్రలో షాక్ ఇవ్వబోతున్న కుర్ర హీరో..!

బాణం, సోలో సినిమాల్లో చిన్న పాత్రలతో నటుడిగా పరిచయం అయిన శ్రీ విష్ణు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2013లో ప్రేమ ఇషన్క్ కాదల్ లో రాయల్ రాజుగా నటించి మెప్పించిన ఇతడు… 2016లో వచ్చిన అప్పుట్లో ఒకడుండే వాడు చిత్రంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న హీరో శ్రీవిష్ణు మరోసారి సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీవిష్ణు రాబోయే చిత్రంలో ఆయన గే పాత్రలో కనిపించబోతున్నారట. స్వలింగ సంపర్కుడిగా భిన్నమైన పాత్రలో కనిపించి.. మరో యువకుడితో రొమాన్స్ చేయనున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ కుర్ర హీరో మరింత ముందుకెళ్లి గే పాత్రలో నటించబోతున్నారు. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన ప్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. తమ అభిమాన హీరో అలాంటి పాత్రలో కనిపించ బోతున్నారంటే స్టోరీ చాలా బాగుంటుందని భావిస్తున్నారు.

అయితే శ్రీవిష్ణు ఏ సినిమాలో గే గా కనిపించబోతున్నాడు, ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, డైరెక్టర్ ఎవరు వంటి అప్ డేట్లను తెలుసుకునేందుకు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. కానీ శ్రీవిష్ణు స్వలింగ సంపర్కుడిగా కనిపించబోయే చిత్రానికి సంబంధించిన అప్ డేట్లు ఇంకా బయటకు రాలేదు. మరి ఇందుకు సంబంధించిన సినిమా, అధికారిక ప్రకటనలు వస్తే గానీ అసలు విషయం తెలియుద. ఏది ఏమైనప్పటికీ విభిన్న జోనర్ లో సినిమాలు తీస్తూ… ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో గే పాత్రలో నటించి హిట్టు కొడతారని అంతా భావిస్తున్నారు.

ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ వస్తున్న శ్రీవిష్ణు… నీదీ నాదీ ఒకే కథ చిత్రంతో చక్కని సందేశాన్ని ఇచ్రాు. ఆ తర్వాత వీర భోగ వసంత రాయులు, బ్రోచేవారెవరురా, తిప్పరా మీం, గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ, భళా తందనానా వంటి చిత్రాలతో అలరించారు. తాజాగా సామజవరగమన అనే చిత్రంతో వేసవి కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్టు కాబోతుందో.