క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ లోని ప్రముఖుల పేర్లను బయట పెడుతూ పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది శ్రీరెడ్డి..టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో గోల చేస్తుంటుంది. ఈ హాట్ బ్యూటీ గతంలో ఒకసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది. వాటి పై ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేస్తుంటుంది.
ఇకపోతే ఆమె చాలా మంది నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు ఏదో ఒక పోస్టును పెట్టి దాన్ని వైరల్ గా మారుస్తు ఉంటుంది. ఆమె రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలదు. ఆమె ఎక్కువగా మెగా ఫ్యామిలీ సంభందించిన బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మరోసారి మెగా ఫ్యామిలీపై తన మాటలతో విరుచుకుపడింది శ్రీ రెడ్డి.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అయితే అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క విషయంలో పవన్ ను లాగుతూ అతనికి సంబంధం ఉన్నా లేకున్నా విమర్శలు చేస్తూ ఆయన అభిమానుల నుండి తెగ విమర్శలు ఎదుర్కొంటుంది శ్రీరెడ్డి. ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది.
అయితే కొన్ని నెలల క్రితం నిహారిక ఇష్యూపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో ఆ సమయంలో ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన శ్రీరెడ్డి నాగబాబును భయంకరంగా తిడుతూ కర్మ అనేది చూశావా అని శ్రీ రెడ్డి చెప్పడం జరిగింది. ఆమెను నాగబాబు ఎంతో టార్గెట్ చేశారంటు ఆమె చెప్పుకొచ్చారు. నాగబాబు నన్ను ఎంతో టార్గెట్ చేశాడని ఆమె వెల్లడించారు.
ఒక ఆడపిల్లని అయిన నన్ను నాగబాబు ఘోరంగా కామెంట్లు చేశారని ఆమె తెలిపారు. నాగబాబు తన సొంత ఛానల్స్ ద్వారా తన గురించి తప్పుగా ప్రచారం చేశారని ఆమె అన్నారు. పబ్ లకు వెళ్లడం అది కూడా మూడు గంటల సమయంలో అది ఉగాది రోజున భర్త లేకుండా నిహారిక వెళ్లడం కరెక్టేనా అని ఆమె ప్రశ్నించడం జరిగింది.
శ్రీరెడ్డి రామ్ చరణ్ మీద కూడా కామెంట్లు చేయడం జరిగింది. అయితే అతని భార్య మెగా కోడలు అయిన ఉపాసన కొణిదెలను కూడా వదల్లేదు ఈ వివాదాస్పద హాట్ బ్యూటీ. ఆమె ఉపాసన గురించి అనుచితమైన మాటలు మాట్లాడడం జరిగింది. అసలు ఉపాసన లేకపోతే మెగా కుటుంబమే ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా నిహారిక విషయంలో కూడా రామ్ చరణ్ ను దూషిస్తూ పరుష పదజాలంతో అతన్ని ఓ ఆట ఆడుకుంది. నీహారిక డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయిన వివాదంలో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీని ఓ రేంజ్లో ఘాటుగా విమర్శలు చేసింది శ్రీ రెడ్డి. చెల్లిని ముందు సరిగా పెంచండ్ర అంటూ రామ్ చరణ్ పై హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది శ్రీ రెడ్డి.
పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం మాట్లాడతారని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు. హిందూ కల్చర్ గురించి మాట్లాడే పవన్ ఇప్పుడు ఏం చెబుతారని ఆమె ప్రశ్నించారు. నీతులు చెప్పే నాగబాబు కూతురును ఇలా పెంచడం ఏమిటని శ్రీరెడ్డి వెల్లడించారు. నా తల్లిదండ్రులు కూడా ఇలానే బాధపడి ఉంటారని శ్రీరెడ్డి అన్నారు. నాగబాబుకు ఇది శాంపిల్ మాత్రమే అని ఇంకా నాగబాబు అనుభవిస్తాడని ఆమె వెల్లడించారు.