పెళ్లిచూపులు సినిమాలో నటించాల్సింది విజయ్ దేవరకొండ కాదా…మరేవరంటే?

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి మొట్టమొదటి చిత్రం పెళ్లిచూపులు.ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో విజయ్ దేవరకొండకు అనంతరం అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి సినిమాలలో నటించే అవకాశం వచ్చింది ఇక ఈ సినిమాలు కూడా మంచి హిట్ కావడంతో ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా ఈయన లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ విజయ్ దేవరకొండకు మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమా కథను విజయ్ దేవరకొండతో తీయాలని ఏమాత్రం భావించలేదట. ఈ సినిమా కథ పూర్తి కాగానే తరుణ్ భాస్కర్ వెంటనే నిఖిల్ కి కలిసి ఈ సినిమా కథను వినిపించడంతో కథ నచ్చిన నిఖిల్ వెంటనే సినిమా చేద్దామని చెప్పారు.

ఇక హీరో దర్శకుడు సిద్ధంగా ఉన్నప్పటికీ సినిమాకి ప్రొడ్యూసర్ దొరకకపోవడంతో ఈ సినిమా చేయడానికి కాస్త ఆలస్యం అయింది. ఇలా ఈ సినిమా చేయడానికి ఆలస్యం కావడంతో నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాకి కమిట్ అయ్యారు. ఇక ఈ సినిమాతో నిఖిల్ బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లిచూపులు సినిమాకు ప్రొడ్యూసర్ దొరకడం జరిగింది.ఇక అప్పటికే ఎక్కడికి పోతావు సినిమాతో బిజీగా ఉన్న నిఖిల్ ఈ సినిమాలో నటించే అవకాశం కుదరలేదు ఇలా నిఖిల్ ఈ సినిమా అవకాశం కోల్పోవడంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండకు వచ్చింది.అలా విజయ్ దేవరకొండ సూపర్ హిట్ కొట్టగా నిఖిల్ మాత్రం సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారని వదులుకున్నారని చెప్పాలి.