ఇన్సైడ్ టాక్ : “దేవర” పై ఊహించని నిర్ణయం ఎవరికీ తెలీదట?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర స్టార్ట్ అయ్యిన ఓ క్రేజీ ట్రెండ్ లో భారీ సీక్వెల్ చిత్రాలు అలాగే యూనివర్స్ చిత్రాలు అనేవి ఒప్పందుకున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్ చిత్రాలు అంటే అంతా భయపడేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి అనే సిరీస్ హిట్ అయ్యిందో అక్కడ నుంచి ఎన్నెన్నో సీక్వెల్ చిత్రాలు మొదలయ్యాయి.

అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ అంతకంతకూ పెరుగుతుంది అని చెప్పాలి. కాగా ఈ సెన్సేషనల్ సీక్వెల్స్ లిస్ట్ లో లేటెస్ట్ గా వచ్చిన భారీ చిత్రమే “దేవర పార్ట్ 2”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఓ క్రేజీ పాయింట్ తో తెరకెక్కుతూ ఉండగా..

నిన్నే ఈ ప్రాజెక్ట్ పై చిత్ర యూనిట్ షాకింగ్ అప్డేట్ అందించారు. ఈ చిత్రంకి సీక్వెల్ ఉందని కొరటాల ఓ వీడియోతో అప్డేట్ అందించడం ఒక్కసారిగా సినీ వర్గాల్లో సెన్సేషన్ గా మారింది. అయితే ఈ అప్డేట్ విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో అయితే ఎవరికీ ఏమీ తెలీదట. మొదటి నుంచి ఒక్క పార్ట్ గానే ప్లాన్ చేసినప్పటికీ ఈ చిత్రం సీక్వెల్ ఉంటుంది అనేది సడెన్ నిర్ణయం అట.

దీనితో అందుకే అసలు ఏ చిన్న బజ్ కూడా లేదని పైగా ఈ అనౌన్సమెంట్ కూడా అప్పటికప్పుడే సడెన్ గా నిర్ణయం తీసుకొని ఇచ్చిన అనౌన్సమెంట్ అని సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ భారీ చిత్రం విషయంలో ఈ షాకింగ్ అప్డేట్ కేజ్రీగా మారింది. 
https://x.com/DevaraMovie/status/1709521829210329280?s=20