Home News షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని మంచి నటుడిగా… హీరోలగా సెటిలవ్వాలని ఎంతో మంది.. ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీకి వస్తారు. ఒక్క అవకాశం కోసం రాత్రి పగలు ఎన్నో కష్టాలు పడతారు. తిండి.. నిద్ర లేకుండా నెలలకి నెలలు పస్తులున్న వారు కోకొల్లలు. ఒక్క అవకాశం వస్తే ఏదో సాధించేశామన్న ఆనందం తో పొంగిపోయేవాళ్ళు ఎంతమందో.

Opittakatha M | Telugu Rajyamవరసగా పెద్ద సినిమాలలో నటించే అవకాశాలు దక్కినా ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనివాళ్ళు నిరంతరం కంగారుపడుతూ వచ్చిన ప్రతీ అవకాశాన్ని తన కెరీర్ కి తగ్గట్టు మలచుకోవడానికి తాపత్రయపడుతుంటారు. ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవడం కోసం పడే పాట్లు ఒకెత్తైతే.. ఆ గుర్తింపు ని పోగొట్టుకోకుండా ఎన్నో రకాలుగా జాగ్రత్తలు పడేవాళ్ళు ఉన్నారు. అయితే కొందరు మాత్రం కాస్త అందరిలో గుర్తింపు దక్కగానే దాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడే వారు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

అలాంటి నటుడే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘ఓ పిట్ట కథ’ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన కేరింత.. మనమంత.. జెర్సీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు పొందిన యంగ్ హీరో విశ్వంత్ పై తాజాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తక్కువ రేటుకు కార్లు ఇప్పిస్తానంటూ విశ్వంత్ మోసానికి పాల్పడ్డాడు అన్న అభియోగం కింద ఈ కేసు నమోదు అయ్యిందని అంటున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విశ్వంత్ ను విచారించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగా విశ్వంత్ మోసానికి పాల్పడితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది త్వరలో వెల్లడికానుంది.

- Advertisement -

Related Posts

Nikki Galrani Gorgeous Pics

Nikki Galrani ,Nikki Galrani Gorgeous Pics ,Tamil Most popular Actress Nikki Galrani Gorgeous Pics,Actress Kollywood Nikki Galrani Gorgeous Pics Shooting spotphotos,Nikki Galrani ,Nikki Galrani...

Catherine Tresa Yellow Dress Photos

Catherine Tresa,Catherine Tresa Yellow Dress Photos,Tamil Most popular Actress Catherine Tresa Yellow Dress Photos,Actress Kollywood Catherine Tresa Yellow Dress Photos Shooting spotphotos,CatherineTresa,Catherine Tresa Yellow Dress...

నిర్మాత‌ల‌కు క‌ళ్ళు బైర్లు క‌మ్మిస్తున్న ఉప్పెన బ్యూటీ..!

ఒక్క సినిమాతో త‌న రాత‌నే మార్చుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. తెలుగు అమ్మాయి కాక‌పోయిన ప‌నిపై శ్ర‌ద్ధ‌తో కొద్ది రోజుల‌లో తెలుగు...

మంచు ల‌క్ష్మీ మెచ్చిన మీమ్.. సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్

సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక మీమ్స్ తో అనేక ఫ‌న్నీ జోక్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్ర‌హ్మానందంతో క్రియేట్ చేసే మీమ్స్ సామాజిక మాధ్య‌మాల‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డ‌మే కాక, ఫుల్ వైర‌ల్...

Latest News