షాకింగ్ : “జైలర్” కి ఫస్ట్ అంత రన్ టైం వచ్చిందట 

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదన్న ఉంది అంటే అది డెఫినెట్ గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “జైలర్” అనే చెప్పుకోవాలి.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చాలా హై ఎండ్ ఎలిమెంట్స్ తో క్రేజీ క్యామియో పాత్రలతో గ్రాండ్ ఎలివేషన్స్ ఇచ్చి మూవీ లవర్స్ కి సెన్సేషనల్ ట్రీట్ ని అందించి అబ్బురపరిచాడు. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక అయితే నిడివితో చిన్న ల్యాగ్ ఉన్నట్టు చాలా మందికి అనిపించింది.

కానీ రజిని అండ్ అనిరుద్ మానియాతో అయితే అది పర్వాలేదు అనిపించింది. ఇక ఇదిలా ఉండగా దీనికే ఇలా అంటే జైలర్ ఒరిజినల్ రన్ టైం ని నెల్సన్ లేటెస్ట్ గా రివీల్ చేసినట్టు తెలుస్తుంది. తాను చెప్పిన దాని ప్రకారం అయితే జైలర్ ఫస్ట్ కట్ ఏకంగా 3 గంటల 10 నిముషాలు వచ్చింది అట.

దీనితో దాన్ని ట్రిమ్ చేయగా 2 గంటల 50 నిమిషాలకి కుదించారు అట. కానీ మళ్ళీ మరికొన్ని సన్నివేశాలు తీసి ఫైనల్ కట్ గా 2 గంటల 45 నిమిషాలకి ప్లాన్ చేసి రిలీజ్ చేసారని తెలుస్తుంది. దీనితో జైలర్ సినిమా భారీ రన్ టైం ని ఒరిజినల్ గా లాక్ చేసుకుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు అదిరే గెస్ట్ రోల్ లో నటించగా తమన్నా సునీల్ లు కూడా ఇంట్రెస్టింగ్ క్యామియో లు చేశారు.