షాకింగ్ : “వీరసింహా రెడ్డి” కి ఇదెక్కడి రెస్పాన్స్.!

balakrishna_veera_simha_reddy_movie_review-sixteen_nine

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో డైలాగ్ అంటే బాలయ్య బాలయ్య అంటే డైలాగ్ అన్నట్టు ఉంటుంది లెక్క. మరి తాను ఏ ముహూర్తాన ఓ డైలాగ్ “ఒన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్” అనేది చెప్పారో కానీ బాలయ్య నిజంగా దానికి బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు లేటెస్ట్ గా వీరసింహా రెడ్డి సినిమాల హిట్స్ తో పలు క్రేజీ రికార్డులు సెట్ చేసి పెట్టారు.

కాగా అఖండ తర్వాత వచ్చిన వీరసింహా రెడ్డి సినిమా తన కెరీర్ లో మరో రికార్డు ఓపెనర్ గా నిలవగా వీరసింహా రెడ్డి నిన్నటి నుంచే స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ లో అయితే రిలీజ్ కి వచ్చింది. మరి ఇందులో ఈ సినిమా షాకింగ్ రెస్పాన్స్ అందుకొని ఓటిటి హిస్టరీ లోనే సరికొత్త రికార్డు నమోదు చేసిందట.

ఈ సినిమాని ఇలా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి తీసుకొని రాగా కేవలం ఒకే ఒక్క నిమిషం లో 1,లక్ష 50 వేల మంది యూనిక్ వ్యూవర్స్ ఈ సినిమాని చూసేందుకు వచ్చారట. అసలు ఇది ఓటిటి హిస్టరీ లోనే పెద్ద రికార్డు అని హాట్ స్టార్ వారు అంటున్నారు. దీనితో వీరసింహా రెడ్డి కి ఈ రెస్పాన్స్  ఒకొక్కరికీ ఇప్పుడు మతి పోతోంది.

మొత్తానికి అయితే బాలయ్య మరోసారి కుమ్మేశారని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకి అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని వర్క్ చేయగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే హానీ రోజ్ కూడా మరో హీరోయిన్ గా నటించగా దునియా విజయ్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటించారు. 
https://twitter.com/DisneyPlusHSTel/status/1628749804053622784