షాకింగ్.! పెళ్ళి ప్రయత్నాల్లో పూజా హెగ్దే.!

Pooja-Hegde

ఇకపై సినిమాల్లో ఛాన్సులు వస్తాయా.? రావా.? ఈ ఆందోళన పూజా హెగ్దేకి ఎందుకు వుంటుంది.? ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘గుంటూరు కారం’ సినిమాల నుంచి పూజా హెగ్దే తప్పుకోవాల్సి రావడానికి కారణం, ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా వుండడమే.

కానీ, పూజా హగ్దే ఒకప్పటిలా ఇప్పుడు వరుస సినిమాలేమీ చెయ్యడంలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ ప్రాజెక్టులతో పూజా హెగ్దే కెరీర్ వేగం ఒకింత తగ్గిన మాట వాస్తవం. ప్రస్తుతానికైతే ఎక్కువగా వెకేషన్స్‌తో సరిపెడుతోంది ఈ భామ.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పూజా హెగ్దే త్వరలో పెళ్ళి పీటలెక్కబోతోందిట. ఆల్రెడీ పూజా హెగ్దే, ఓ వ్యక్తితో ప్రేమలో వుందనీ, అతను ప్రముఖ వ్యాపార వేత్త తనయుడని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే, పూజా హెగ్దే మాత్రం, ‘పెళ్ళికి ఇంకా చాలా సమయం వుంది’ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చాలామంది ఇలా చెప్పడం, అనూహ్యంగా పెళ్ళి ప్రకటనతో షాకివ్వడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.

ఓ దీపికా పడుకొనే, ఓ అలియా భట్, ఓ కైరా అద్వానీ.. చెప్పుకుంటూ పోతే, చాలామంది అందాల భామల కెరీర్ పెళ్ళయ్యాక కొత్త మలుపు తిరిగింది. పూజా హెగ్దే కూడా అదే బాటలో పయనించనుందా.?