షాకింగ్ : డాక్టరేట్ వద్దనుకున్న పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు చిత్రాల్లో హీరోగా నటిస్తుండడమే కాకుండా రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీ బిజీగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇపుడు పవన్ ఫోకస్ అంతా సినిమాలు పక్కన పెట్టి పొలిటికల్ గా బిజీగా ఉండగా పవన్ ఫ్యాన్స్ మాత్రం సినిమాల రిలేటెడ్ పోస్ట్ లతోనే పబ్బం గడుపుతున్నారు.

కాగా ఇదిలా ఉండగా పవన్ కి ఈ గ్యాప్ లోనే ఓ గౌరవార్థ పురస్కారం వచ్చింది. మన దేశంలో అనేకమంది సినీ సహా రాజకీయ మరియు పలు ఇతర రంగాల్లో కూడా డాక్టరేట్ ఇచ్చి గౌరవప్రదంగా సత్కరిస్తారని తెలిసిందే. కాగా అలా ఈ ఏడాది వచ్చిన లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కి కూడా డాక్టరేట్ ని వి ఈ ఎల్ ఎస్ వారు అనౌన్స్ చేయగా పవన్ దానిని సున్నితంగా తిరస్కరిస్తన్నట్టుగా తెలిపాడు.

తాను ఈ డాక్టరేట్ కి అర్హుడిని కాదని అనుకుంటున్నాను అని నా కన్నా ఎంతో మహోన్నత వ్యక్తులు మన దేశంలో ఉన్నారు వారికి దానిని అందజేయండి అని తనకి వచ్చిన డాక్టరేట్ ని వద్దనుకున్నాడు. దీనితో ఈ వార్త వైరల్ గా మారింది. కానీ న్యూస్ లో గాని ఇంకెక్కడా పెద్దగా ప్రచురితం చేయడం లేదు. కానీ పవన్ డాక్టరేట్ ని తిరస్కరించడాన్ని పొలిటికల్ గా కూడా పవన్ ఫాలో అయ్యేవారు గర్వంగా చెప్పుకుంటున్నారు.