నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. ప్రస్తుతం కూడా సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తూ ఉండటం విశేషం.నిర్మాత సుధాకర్ చెరుకూరికి మూవీ భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది. నేచురల్ స్టార్ నాని ఇమేజ్ ని దసరా రెట్టింపు చేసిందని చెప్పాలి.
ఇక కీర్తి సురేష్ కూడా మహానటి తర్వాత ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సినిమాగా దసరా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ కారణంగా ఇప్పుడు నాని 30వ సినిమాకి మంచి బూస్ట్ వచ్చింది. కొత్త దర్శకుడు శౌర్యువ్ తో ఈ మూవీ చేస్తున్నారు. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఆడియో రైట్స్ ని టి-సిరీస్ ఏకంగా ఏడు కోట్ల రూపాయిలు చెల్లించి సొంతం చేసుకుందంట. నాని కెరియర్ లోనే హైయెస్ట్ ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఒటీటీ సంస్థ ఏకంగా 36 కోట్లు ఆఫర్ చేసిందంట. ఇది కూడా నాని కెరియర్ లో హైయెస్ట్ పెయిడ్ అని చెప్పాలి.
మొత్తానికి నాని 30 మూవీ ఇంకా ఫస్ట్ షెడ్యూల్ లో ఉండగానే నాన్ థీయాట్రికల్ బిజినెస్ ద్వారానే 40 కోట్లకి పైగా ఆదాయం సంపాదించడం నిజంగా సంచలనం అని చెప్పాలి. దీనిని బట్టి నేచురల్ స్టార్ నాని మార్కెట్ రేంజ్ పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా ఉన్న నేపధ్యంలో పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.
దసరా హిట్ కారణంగా ఇప్పుడు కొత్త సినిమాకి ఈ స్థాయిలో డిమాండ్ వచ్చిందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక నాని 30 మూవీ కూడా హిట్ అయితే అతని మార్కెట్ రేంజ్ కూడా టైర్ 1 హీరోలతో సమానంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.