Pawan Kalyan Bheemla Nayak : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ని అలరించి ఇప్పుడు ఆల్ మోస్ట్ ఫైనల్ రన్ కి వచ్చేసింది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి గట్టి ఓపెనింగ్స్ దక్కించుకున్నా ఒక్క ఏపీలో మాత్రం దాదాపు అన్ని ఏరియాల్లో కూడా నష్టాల్లోనే ముగిసింది. ఒక్క ఇక్కడ మినహా అన్ని చోట్ల కూడా మంచి లాభాలను భీమ్లా నాయక్ అందించాడు. మరి ఇదిలా ఉండగా తాజాగా ఏపీలో కొత్త రేట్లు రావడం ఇతర భారీ సినిమాలకి సంబంధించి ఓ షాకింగ్ ఫ్యాక్ట్ బయటకి వచ్చింది.
ఏపీలో తన సినిమా వచ్చే వరకు కొత్త ధరలు విడుదల చెయ్యరని అందుకే తన సినిమా భీమ్లా నాయక్ కి నష్టాలు వచ్చినా పర్వాలేదు నా సినిమా తర్వాత మిగతా సినిమాలు వచ్చే నాటికి కొత్త ధరలు వస్తాయి అందుకే భీమ్లా నాయక్ కి నష్టం వచ్చినా అది తాను భరిస్తానని చెప్పడం జరిగిందట.
అందు వల్లే “భీమ్లా నాయక్” ని పవన్ కళ్యాణ్ కావాలనే ముందు రిలీజ్ చేయించారని ఈ సినిమా గోదావరి జిల్లాల డిస్ట్రిబ్యూటర్స్ తాజాగా తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి పవన్ వారికి నష్టాలు ఎంతవరకు తిరిగి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారో తెలియాల్సి ఉంది.