యూఎస్ లో “SSMB28” కి షాకింగ్ డిమాండ్.?

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఎప్పుడు నుంచో భారీ క్రేజ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. కాగా తాను తన కెరీర్ లో 28వ సినిమాగా అయితే చేస్తున్న సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.

ఐతే దీనిపై ఆల్రెడీ సెన్సేషనల్ హైప్ ఉండగా ఇది ఇప్పుడు మరింత స్థాయిలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమాకి యూఎస్ లో ఊహించని లెవెల్ రిలీజ్ ఉంటుంది అని గట్టి టాక్ ఉంది. సుమారు 800 కి పైగా లొకేషన్స్ లో ఆల్రెడీ డీలింగ్స్ నడుస్తూ ఉండగా.

ఇంత మొత్తంలో అయితే ఈ సినిమాకి 4 నుంచి 4.5 మిలియన్ డాలర్స్ మేర బిజినెస్ చేస్తుంది అని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇది ఏకంగా 5 మిలియన్ డాలర్స్ కి చేరింది అట. దీనితో ఈ సినిమాపై క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాని అయితే మొదట ఓ ఏక్షన్ సినిమాగా ప్లాన్ చేయగా ఇప్పుడు ఇప్పుడు ఓ మాస్ సినిమాగా మారింది.

ఇక ఈ సినిమాలో అయితే యంగ్ హీరోయిన్ శ్రీ లీల అలాగే మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.