షాకింగ్ బజ్ : “బిగ్ బాస్ 7” హోస్ట్ గా ఈ ఫైర్ లేడీ?

ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ఏదొక కొత్తదనం లేకపోతే ముందు రాణించలేని పరిస్థితి. అలాగే ఇది ఎంటర్టైన్మెంట్ రంగంలో అయితే మరీ గట్టిగా ఉంటుంది. అయితే ఇండియన్ టెలివిజన్ హిస్టరీ దగ్గర ఓ బెంచ్ మార్క్ చేసిన భారీ రియాలిటీ షోస్ లో అయితే బిగ్ బాస్ అనే షో కూడా ఒకటి.

మరి ఈ షో అన్ని భాషల్లో ఉన్నప్పటికీ కూడా మన తెలుగు షో సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఇప్పటివరకు మొత్తం 6 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఏడవ సీజన్ వస్తుంది. అయితే ఈసారి కూడా మళ్ళీ హోస్ట్ నాగార్జునేనా అనే డీలా పడ్డారు ఆడియెన్స్ అంతా పైగా నాగార్జునే ఈ సీజన్ ని కూడా ప్రమోట్ చేస్తుండడంతో అయితే ఈసారి హిట్ అవుతుందో లేదో అని అందరిలో డౌట్స్ ఉన్నాయి. అ

యితే ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ బజ్ అయితే బయటకి వచ్చింది. దీనితో ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కనిపించరట. మొట్ట మొదటి సారి అయితే ఓ లేడీ హోస్ట్ ఈ సీజన్ ని ముందుకు తీసుకెళ్తుంది అని ఫ్రెష్ బజ్ స్టార్ట్ అయ్యింది.

దీనితో లాస్ట్ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో అయితే రచ్చ రచ్చ చేసిన ఫైర్ లేడీ గీతూ రాయల్ అయితే సరికొత్త హోస్ట్ గా లాక్ అయ్యింది అని ఇప్పుడు రూమర్స్ మొదలయ్యాయి. ఇది దాదాపు కన్ఫర్మ్ అని కూడా అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే అఫీషియల్ అయితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా చూడాలి.